జీగిరాం వై జంక్షన్ వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలి

  సాలూరు టౌన్ శివారులో జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న ఈ వై జంక్షన్ లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తే మంచిదని ప్రయాణికులు,గ్రామస్తులు వేడుకుంటున్నారు.రాత్రి వేళల్లో, తెల్లవారుజామున హెచ్చరిక బోర్డులు సరిగా కనిపించక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఈ ప్రదేశంలో జరుగుతున్నాయని ప్రజలు చెప్తున్నారు.కావున సంబంధిత అధికారులు ఈ ప్రదేశంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Continue Reading

పొలం పిలుస్తోంది…కియా,చినొవా పంటల ప్రయోగం

సాధారణ చిరుధాన్యాల కంటే మూడింతలు ఎక్కువ ధరలు పలుకుతున్న చియా మరియ కినోవా పంటల పెరుగుదల మరియు దిగుబడులు ఎలా వస్తాయో తెలుసుకోవడం కోసం చాపరాయివలస గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో విత్తనాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ సాధారణ చిరుధాన్యాలతో పోలిస్తే కినోవా లో గ్లూటన్ ఉండాలని గుండె జబ్బులకు, మధుమేహ వ్యాధి నియంత్రణకు ఎక్కువగా ఉపయోగపడతాయని బరువు నియంత్రణలో ఉంచుకోవడం కోసం కినోవా ఎంతగానో ఉపయోగపడుతుందని […]

Continue Reading

సాలూరు టౌన్ బంగారమ్మ పేట లో దొంగలు పడ్డారు…

సాలూరు టౌన్ పరిధిలో బంగారమ్మ పేట కు చెందిన డి. వెంకటరమణ (57) ఇంట్లో 7 గ్రాముల బంగారు ఆభరణాలు 37 వేల రూపాయల సొమ్ము గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నవంబర్ 7వ తారీఖున డి. వెంకటరమణ, లక్ష్మి దంపతులు విశాఖపట్నం పెందుర్తి ఏరియాలో నివాసముంటున్న తమ కుమార్తె ఇంటికి అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమానికి వెళ్లారు. తదుపరి నవంబర్ 9 న రాత్రి 12 గంటల […]

Continue Reading

విజయవాడ కృష్ణానది ఒడ్డున కార్తీక దీపాలు విడిచిపెట్టిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

  కార్తీక మాసం మహా పుణ్యకాలం 3వ సోమవారం సందర్బంగా విజయవాడ లో కృష్ణానదీ ఒడ్డున కార్తీకదీపాలు విడిచిపెట్టి, అనంతరం రాష్ట్రo సుభిక్షం గా ఉండాలని అ పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు….గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…. 4th Estate News,vijayawada@ 4thestate.in

Continue Reading

గాయపడ్డ వ్యక్తికి 50 వేల ఆర్థిక సహాయం అందించిన సిరమ్మ

  నవంబర్ 9 వ తేదీన పార్వతిపురం మన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కళాసిగా పనిచేస్తున్న రెడ్డి రమేష్ నాటు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన శ్రీనివాస్‌రావు, తన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ చేతుల మీదుగా బాధిత రమేష్‌కు ఆదివారం 50 […]

Continue Reading

రసాయనాలు వాడకం తో దుష్ప్రభావాలు

  సాలూరు టౌన్ పాత బస్టాండ్ వద్ద ఉన్న అరటి పళ్ళ దుకాణాల్లో హ్యూమన్ రైట్స్ ప్రతినిధి నైన శ్రీనివాసరెడ్డి పిర్యాదు మేరకు జిల్లా ఆహార భద్రత శాఖ అధికారి వినోద్ తనిఖీలు చేసి వారి వద్ద నుంచి అరటి పళ్ళ శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కి పంపిస్తున్నామని అన్నారు.వచ్చిన ఫలితాలు ఆధారంగా చర్యలు ఉంటాయి అన్నారు.అరటి పళ్ళును త్వరగా మగ్గటానికి ఎక్కువగా వాడే రసాయనం కాల్షియం కార్బైడ్ , ఇథిలిన్ వంటి వాటిని వ్యాపారులు […]

Continue Reading

రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీ కి ఎన్నికైన జరజాపు దిలీప్

జనసేన పార్టీ తరుపున కార్పొరేషన్ కమిటీ రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీలో సాలూరు సీనియర్ రాజకీయ నేత జరజాపు సూరిబాబు కుమారుడు,సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ జరజాపు దీప్తి భర్త,జనసేన యువ నాయకులు జరజాపు దిలీప్ సాలూరు తరుపున ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సాలూరు జనసేన నాయకులు పిల్లా మురళి, సుంకర గోపి, బెవర పరశురామ్, అవ్వా సంతోష్, గరికపాటి సంతోష్,సాలూరు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Continue Reading

సాలూరు టౌన్ ఐటిఐ అప్రెంటిస్ మేళా లో 48 మంది ఎంపిక

నవంబర్ 10 న జరిగిన అప్రెంటిస్ మేళాకు 64 మంది విద్యార్థులు హాజరు కాగా 48 మంది ఎంపిక అయ్యారు. విశాఖపట్నం యోకోమో టైర్స్ కంపెనీకి 18 మంది పాటిల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 12 మంది, కొవ్వూరు ప్లాంట్ కు 8 మంది… విశాఖపట్నం కార్బన్ కు 10 మంది అప్రెంటీస్ శిక్షణకు నియామకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పై కంపెనీల హెచ్ ఆర్ లు చైతన్య రమేష్,సాలూరు ఐటిఐ ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసాచార్యులు, అప్రెంటిషిప్ […]

Continue Reading

సాలూరు లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు

సాలూరు శ్రీనివాస్ నగర్ లో కొలువైన శ్రీ భూ నీళా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో నవంబర్ 15వ తేదీ శనివారం బహుళ ఏకాదశి పుణ్య కాలంలో శ్రీవారి దివ్య క్షేత్రంలో శ్రీ నిలయం కళ్యాణ మండపము లో సామూహిక శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహిస్తామని వ్యవస్థాపక ధర్మకర్త వంగపండు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.616 రూపాయలు చెల్లించి,తమ గోత్రనామములను నమోదు చేసుకోవలసినది గా కోరారు.మరిన్ని వివరాలకు 8602310314,7389762963,9490971991,8185910086 నెంబర్లను సంప్రదించగలరు.

Continue Reading

మానవ సంబంధాలే పరమావధి…

  రాజకీయాలలో ప్రత్యర్థులు అయినప్పటికీ మానవ సంబంధాలే పరమావధిగా భావించి సాలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు ఆర్పీ.భంజ్ దేవ్ కి మోకాలు శస్త్ర చికిత్స జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం పిడిక. రాజన్నదొర శనివారం సాయంత్రం ఆర్పి.భంజ్ దేవ్ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. సాలూరు,4thestate.in,4th Estate web News portal

Continue Reading