

సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వేంచేసియున్న శ్రీ వింధ్యవాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారికి పవిత్ర కార్తీక మాసంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు తొలి పూజగా బంగారు శివలింగమునకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, బంగారు పువ్వులతో అర్చన, తదుపరి నిత్య అభిషేకములు, విశేష పూజలు జరుగును. సాయంత్రం ఆకాశదీప అర్చన, నమకం, చమకంతో బిల్వ దళార్చన, దశవిధ హారతులు, చతుర్వేద స్వస్తి, వేద ఆశీర్వచనం జరుగును. అక్టోబర్ 27 తొలి కార్తీక సోమవారం షష్టి రోజున నగరేశ్వరునికి భస్మాభిషేకం జరిగింది. తదుపరి 2 వ సోమవారం అనగా నవంబర్ 3 వ తేదీన గంధాభిషేకము, 3 వ సోమవారం అనగా నవంబర్ 10వ పంచమి రోజున చక్కెరాభిషేకము, నవంబర్ 17 న బహుళ త్రయోదశి రోజున అన్నాభిషేకము జరుగును. నవంబర్ 18 మాస శివరాత్రి రోజున నగరేశ్వర స్వామివారికి విశేష మారేడు పత్రి పూజలు జరుగును.
