

కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి అని ప్రతీ కార్యకర్తకు పిలుపునిచ్చిన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చిన్న శ్రీను కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ
బుధవారం భీమిలి నియోజకవర్గం,భీమిలి పాత బస్టాండ్ లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్,వైస్సార్సిపీ జిల్లా అధ్యక్షులు భీమిలి వైస్సార్ సిపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను ) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షులు రాలు సిరమ్మ* భీమిలి నియోజకవర్గం , భీమిలి పాత బస్టాండ్ వద్ద 3 వార్డు లో వైయస్ఆర్ సీపీ కోటి సంతకాలు కార్యక్రమం లో పాల్గొని స్వయంగా తాను అందరిచే సంతకాలు చేయించారు. అటుగా వస్తున్న బస్ ను ఆపి అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల కోటి సంతకాలు చేయించారు.
ఈ సందర్బంగా చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో పేదవాడికి విద్య వైద్య అందుబాటులో లేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు,మెడికల్ కాలేజ్ పేద ప్రజలకు ఆరోగ్యానికి జీవనాడి ప్రైవేట్ పరం చేస్తే పేద వాడికి వైద్యం ఎక్కడ అందుతుందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మైలపిల్లి షణ్ముఖరావు, 3వ వార్డ్ ఇంచార్జ్ వైసీపీ, కదిరి ఎల్లాజీ ఎక్స్ కౌన్సిలర్,మైల పిల్లి లక్ష్మణరావు ఎక్స్ కౌన్సిలర్,
ఆళ్లపల్లి నరసింహారావు, ఎర్రిబాబు. వాసుపల్లి కొండబాబు. వాసుపల్లి జగ్గారావు. కొండ్రు రామవర సరప్పుడు. పీతల శంకర్రావు. బోన్ సంజీవరావు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
