
ప్రస్తుతం వరి పొలాల్లో దోమపోటు, ఆకు ఎండు తెగులు, పాము పొడ తెగులు ఆశించి ఉన్నాయని రైతులు తగు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. చెరుకుపల్లి మరియు పనుకువలస గ్రామాలలో వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమపోటు అనేది పిల్ల పురుగులు దశలోనే నివారించుకోవాలని వందల సంఖ్యలో గుడ్లు పెట్టడం వలన ఉదృతే పెరిగినప్పుడు నివారణ చాలా కష్టం అవుతుంది అని ఒక్కోసారి పంట నష్టం 70 నుంచి 80 శాతం వరకు కూడా ఉండే అవకాశం ఉందని కాబట్టి రైతులు వ్యవసాయ సహాయకుల సేవలను వినియోగించుకుని దోమ ఉధృతిని తెలుసుకొని తగు చర్యలు చేపట్టాలని కోరారు. పిల్ల దోమలు వరి పంట మొదలు వద్ద చేరి రసం పీల్చడం వలన పంట చివర్ల నుండి ఎండుకుంటూ వస్తుందని ఒక్కోసారి పొట్ట కుళ్ళు తెగులు పాము పొడ తెగులు దోమ పోటు తో కలిసి ఉండడం వలన పొట్ట నుంచి వెన్ను సరిగ్గా బయటికి రాకుండా తాలుగింజలు ఎక్కువగా ఉండి దిగుబడి బాగా తగ్గుతుందని తెలిపారు వీటి నివారణకు డైనోటో ఫిరాన్ 250 గ్రాములు అజాక్సీ స్ట్రోబిన్ 200 మిల్లీ లీటర్ల కలిపి చేను బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలని సూచించారు నిర్లక్ష్యం వహిస్తే మూడు నాలుగు రోజులలోనే దోమ ఉధృతి పెరుగుతుందని కాబట్టి రైతులందరూ ఎప్పటికప్పుడు ప్రతి రోజు ఉధృతిని గమనించి నివారణ చర్యలు చేపట్టాలని యూరియా ఎట్టి పరిస్థితులలో ఎక్కువగా వేయకూడదని క్రిమిసంహారిక మందులు పిచికారి చేసిన తర్వాత మాత్రమే యూరియా వేసుకోవాలని తెలిపారు. గాలి బాగా ఆడటం కోసం పాయలు తీసుకుంటే దోమ ఉధృతిని కొంతవరకు నివారించుకోవచ్చని తెలిపారు ప్రకృతి సేద్యం చేస్తున్న వాళ్లు తూటి కాడ కషాయం పిచికారి చేసుకోవడం ద్వారా దామ ఉధృతిని అరికట్టవచ్చని పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం పిచికారి ద్వారా పాము పొడ ఆకు ఎండు తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నాగమణి వి ఏ ఏ లావణ్య హాజరయ్యారు.
