
టిడిపి వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడు గా స్టార్దం సాధించిన ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ…తదుపరి జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో దూసుకుపోతున్నారు.బాలయ్య సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ల పర్యటించారు. ఈ మేరకు ‘సూపర్ జీఎస్టీ సేవింగ్స్ ర్యాలీ’ నిర్వహించారు. ఈ ర్యాలీలో బాలయ్యకు వింత అనుభవం ఎదురైంది. బాలయ్యకు వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభిమానులు పెద్దఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. బాలకృష్ణను చూడగానే అభిమానులు ‘మీరు మంత్రిగా రావాలి’ అంటూ నినాదాలు చేశారు. దాంతో బాలకృష్ణ నవ్వుతూ వెళ్లిపోయారు.నందమూరి నట వారసుడిగా తండ్రి పేరు నిలబెట్టిన బాలయ్య రాజకీయ రంగం లో ఉన్నత పదవులు అధిరోహించాలని అభిమానుల ఉవాచ.గతం లో అన్న నందమూరి హరికృష్ణ 6 నెలలు రవాణా శాఖ మంత్రి గా పని చేశారు.సోదరి దగ్గుబాటి పురందరేశ్వరి కేంద్ర వాణిజ్యం, మానవ వనరుల,పరిశ్రమల సహాయ శాఖ మంత్రి గా పనిచేసిన చరిత్ర ఉంది…
4thestate.in
