ఎన్ బ్రాండ్ మద్యం నోట్లో పోసుకుంటే విషమే…ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్

ఎన్ బ్రాండ్ మద్యం నోట్లో పోసుకుంటే విషమే….ప్రజలు అప్రమత్తం గా ఉండాలి

_పేదవాళ్లు తాగే మద్యాన్ని టార్గెట్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతోంది.నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సప్లై చేసిన వ్యక్తిని ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు.ఇదంతా నడింపించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు.నకిలీ మద్యం కేసులో తెరవెనుక ఉన్న వాళ్లంతా కరకట్ట పెద్దలే._

_టీడీపీ నకిలీ మద్యం మాఫియాపై వరుస కథనాలు రాస్తూ జనాలకి నిజాలు తెలియజేస్తున్న సాక్షి మీడియాపై అక్రమ కేసులతో కక్ష సాధింపులు. అయినా సాక్షి రిపోర్టర్ ఇంట్లో సోదాలు చేస్తే నకిలీ మద్యం ఎలా దొరుకుతుంది.. వెళ్లి తంబళ్లపల్లెలో మీ టీడీపీ ఇంచార్జ్ ఇంట్లో కదా సోదాలు చేయాల్సింది బాబు గారు. నకిలీ మద్యంపై సిబిఐ విచారణకు డిమాండ్.._

రాష్ట్రంలో అక్రమ సంపాదన కోసం నకిలీ మద్యం తయారీ ప్రారంభించారు.

_అమాయక ప్రజల ప్రాణాలు హరించే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు._

– _ఈ నకిలీ మద్యం తయారీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో జరిగింది._

– _కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యాన్ని తయారీ చేపట్టారు._

– _నకిలీ మద్యం బాగోతం బయట పడ్డాక కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు._

– _ఈ‌‌ మాఫియా కేవలం మూడు నాలుగు ప్రాంతాలకే పరిమితం కాలేదు అనే అనుమానాలు వున్నాయి._

– _అసలు మద్యం బాటిల్స్ ను పోలినట్లుగా తయారీ చేయడం వెనుక అధికార పెద్దల హస్తం వుంది._

– _ఇలాంటి మాఫియా పనులులో టిడిపీ ప్రభుత్వం ఆరితేరిపోయింది._

– _జయచంద్ర రెడ్డి టిడిపీ ఎమ్మెల్యే అభ్యర్థి., నేటికి తంబళ్లపల్లె ఇన్చార్జ్._

– _ఈ మాఫియాలో మరో ముగ్గురు కట్టా సురేంద్ర నాయుడు, జనార్థన్ రావ్ చంద్రబాబు, లోకేష్ లతో సత్సంబంధాలు లేవా._

– _మా హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిచాయి._

– _క్యూఆర్ కోడ్ ద్వారా నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిపాము._

– _అలాంటిది అక్రమ మద్యం కుంభకోణం మోపో మా వారిని జైలు పాలు చేశారు._

– _నేడు పట్టుబడ్డ వారు మా పార్టీ వారు కాదని వాదిస్తున్నారు._

– _దొంగ దొరికితే వైసిపీ కోవర్టు అంటూ డ్రామాలు ఆడటం పరిపాటిగా మారింది._

– _చంద్రబాబు నాయుడు నోటిలో రానురాను అబద్దాలు మితిమీరిపోయాయి._

– _జయచంద్ర వైసిపీ కోవర్ట్ అంటే ఎలా టికెట్ ఇచ్చాడో సమాధానం చెప్పాలి._

– _నేడు మీ పార్టీలో ఎమ్మెల్యేలు,మంత్రిలుగా వున్న మా పార్టీ నుండి వచ్చిన వారు అందరూ కోవర్టులేనా..?_

– _తప్పు చేసి దొరికిపోతే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం._

– _ఏపిలోని ఇబ్రహీంపట్నం, ఏలూరు, అనకాపల్లిలో కూడా నకిలీ మద్యం తయారీకి ఆఫ్రికాకి లింకేంటి.._

– _రాష్ట్రంలో బెల్ట్ షాపులపై ఎక్కడా చర్యలు లేవు, బెల్ట్ షాపులు నడుస్తున్నది టిడిపీ నేతల‌ కనుసన్నల్లో.._

– _ప్రతి నియోజకవర్గంలో‌ నకిలీ మద్యం యూనిట్స్ వున్నాయి._

– _మా వారిపై అక్రమ మద్యం కేసు పెట్టి ఆధారాలు లేకుండా కోర్టుల‌ చుట్టూ తిరుగుతున్నారు._

– _నకిలీ మద్యం తయారీ పై ఎందుకు సిబిఐ ఎంక్వరీ వేయడం‌ లేదు._

– _నెల్లూరులో నిజాలను ప్రచురించిన సాక్షి పేపర్ పై అక్రమ కేసులు మోపారు._

– _కనిగిరి సాక్షి రిపోర్టర్ ఇంటిపై ఎక్సైజ్ దాడులు చేయించారని చిన్న శ్రీను  అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *