
శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం, గుమడాం తరఫున
మొట్ట మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న నిరుపేద వృద్ధ మహిళకు (బార గంగమ్మ) వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెల 1000/- రూపాయలు సహాయం అందించేందుకు గ్రూప్ సభ్యులు నిర్ణయించుకొని గురువారం సహాయం చేయడం జరిగింది.
సంఘ సభ్యులు దొంతల గౌరీ శంకర్రావు(వైస్ ప్రెసిడెంట్), చిగురుకోటి నాగరాజు ( సలహాదారులు), వాకాడ వంశీ కృష్ణ (ట్రెజరర్), పెద్దలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యంగా బంటు సోమేశ్వరరావు ( ( ప్రెసిడెంట్) ఇటువంటి సేవా కార్యక్రమాల చేయటం కోసమే శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం స్థాపించడం జరిగిందని తెలిపారు.
4th Estate News @4thestate.in