
మక్కువ నుండి బాగువలస మీదుగా వెళ్లే సాలూరు రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మక్కువ మెయిన్ రోడ్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు జిల్లా నాయకులు కొల్లి గంగు నాయుడు,ఎన్. వై. నాయుడు మాట్లాడుతూ మక్కువ మండలం నుండి ఇద్దరు మంత్రులు మారినప్పటికీ సాలూరు రోడ్ పూర్తి కాలేదని గత ఆరు సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అన్నారు కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదని అందువలన మక్కువ నుండి సాలూరు వెళ్లే ప్రజలంతా మామిడిపల్లి మీదుగా వెళ్ళవలసి వస్తుందని అన్నారు. సాలూరు మండలం తో పాటు మక్కువ మండలం లో ఉన్న అన్ని గ్రామాలకు ఈ రోడ్డు చాలా ఉపయోగకరమని, ఎంతో ఉపయోగకరమైన రోడ్డు అని ఈ రోడ్డు పూర్తి కాకపోవడం దుర్మార్గమన్నారు కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుగ్గేరు వచ్చి దుగ్గేరు, సిరివర రోడ్డు పూర్తి చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని హామీ ఇచ్చి సంవత్సరం దాటుతున్న ఇంతవరకు రోడ్ల పూర్తి కాలేదని అన్నారు. ఇప్పటికైనా మక్కువ నుండి బాగువలస మీదుగా వెళ్లే సాలూరు రోడ్డును మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి చేయాలని లేకపోతే ప్రజలందరినీ కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి ముందు మక్కువ మండల తహసిల్దార్ కి మెమోరాండం ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.