రసాయనాల కంటే కషాయాలే మిన్న

Uncategorized

తినే తిండి ఆరోగ్యవంతమైనదిగా ఉండాలంటే పంటలను కూడా ఆరోగ్యవంతంగా పండించాలని పంటలు ఆరోగ్యంగా పండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. విశ్వనాధపురం గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది భాగంగా ప్రకృతి సేద్య పద్ధతులలో పండిస్తున్న కూరగాయల పంటల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా యువ రైతు హర్షద్ పండిస్తున్న చిక్కుడు బీర వంగ మిరప పండ్ల తోటల నమూన రైతులతో కలిసి క్షేత్ర సందర్శన చేశారు రైతు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎలాంటి పురుగుమందులు తెగులు మందులు వాడలేదని కేవలం జీవామృతాలు కషాయాలతోనే సాగు చేస్తున్నానని తెలిపారు. అనంతరం ఐ సి ఆర్ పి కుమార్ ఆధ్వర్యంలో ద్రవ జీవామృతం, జిల్లేడు ద్రావణం తయారు చేయించడం జరిగింది. రైతులు కనీసం తినే తిండి గింజల వరకు అయినా సరే అతి చిన్న మొత్తంలో ప్రకృతి సేద్యం కొనసాగించాలని నేల పంట మానవాళి ఆరోగ్యం అంతా ప్రకృతి సేద్యం పైనే ఆధారపడి ఉందని వ్యవసాయ అధికారి కోరారు. రైతులందరూ అన్ని పంటలను నెలాఖరులోగా ఈ పంటలో నమోదు చేసుకోవాలని కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పుడు తప్పనిసరిగా ఈ పంట ఐడి ఉండాలని కాబట్టి రైతులు రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి విజయ్, వి ఏ ఏ అశ్విని లావణ్య ,మోడల్ మేకర్ రాము రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *