
చిన్న తరహా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు పై ఎల్ కోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్, పాల్ మెమోరియల్ ఫౌండేషన్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది..
ఎమ్మెస్ ఎం ఎ ఇ అవగాహన సదస్సు..
గురువారం ఎల్ కోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్, పాల్ మెమోరియల్ ఫౌండేషన్ నందు విజయనగరం జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వారి ఆదేశానుసారం ఏజెడ్ కంపెనీ సీఈవో కాళ్ళ జగపతి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మోహన్, ఆషా ర్యాంపు కార్యక్రమంలో భాగంగా జెడ్ ( జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్) సర్టిఫికెట్ కోసం అవగాహన సదస్సు కల్పించడం జరిగింది.
- జెడ్ సర్టిఫికెట్ ను కేంద్ర ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు ఉచితముగా అందజేయడం జరుగుతున్నది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే యువ పారిశ్రామిక వేత్తలకు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ లోన్స్, ప్రయోజనాల కోసం గురించి కూడా వివరించడం జరిగినది. జెడ్ ఈ డి సర్టిఫికెట్ ద్వారా నిర్వహించే వ్యాపారాలకు గుర్తింపు ఇవ్వబడుతుందని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వాలను సహాయం అందిస్తాయని తెలిపారు 3 లక్షల రూపాయలు వరకు రుణ సదుపాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షులు డి. డానియల్ ,,, కొత్తవలస ఏఎంసి డైరెక్టర్ ఎం త్రినాధ రావు,చిన్న తరహా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.