
పాచిపెంట రూరల్, సెప్టెంబర్ 16,(4th Estate News) మంగళవారం మధ్యాహ్నం పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో ఆ గ్రామ వైసీపీ సీనియర్ కార్యకర్త కేతవరపు గణేశ్వర రావు(80 సం. లు) మరణించారుఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర పాంచాలి గ్రామం వెళ్లి గణేశ్వరరావు భౌతికాయాన్ని సందర్శించి పూలమాల వేసి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.ఈ సందర్బంగా మృతుడు గణేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర మాట్లాడుతూ వారికి ధైర్యం తెలిపారు.ఈ కార్యక్రమంలో పాచిపెంట మండల ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.