
విజయనగరం,సెప్టెంబర్ 14,(4th Estate News)
శనివారం విజయనగరంలో పాత బస్టాండ్ దగ్గర పుట్చలవీధిలో నివశిస్తున్న నాళం వెంకట రత్నం భర్త పాండురంగ జనార్ధన రావుకి వెన్నెముకకు పెద్ద ఆపరేషన్ అయినందున తాను జీవించుటకు ఉపాధి లేక, తన బ్రతుకుతెరువు కోసం (జీవనోపాధి) కొరకు చిన్న శ్రీను సోల్జర్స్ కార్యాలయాని ఆశ్రయిoచి తమ సమస్యను తెలుపగా వెంటనే స్పందించిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ & వై.యస్.ఆర్ .సి.పీ. జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ టిఫిన్ & స్నేక్స్ పెట్టు కొనుటకు కావలసిన సామగ్రినీ, తోపుడు బండిని అంధిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ వారికి ఆశ్రాగా నిలుస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచిని పెంచుదాం మంచిని పంచుదాo అనే లక్ష్యంతో ఏర్పాటు అయిన చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ ఆర్థికంగా జీవనోపాధి లేని వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.
ఇటువంటి కార్యక్రమాలు చేయుటలో ఉత్తరాంధ్ర లోనే సిరమ్మ పేరు ఎక్కువగా వినిపిస్తుందని ప్రజల్లోనే మంచి పేరుందన్నారు.
ఈ కార్యక్రమంలో లాయరు అంజనీ కుమార్ , చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, లోకల్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.