
(పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 10,4th Estate News)
రైతులు విచక్షణ రహితంగా రసాయనాలు వాడకుండా దిగుబడి పెంచడమే కాకుండా సాగు ఖర్చులను కూడా తగ్గిస్తూ భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ అంతర పంటలు గట్లు మీద కంది విత్తనాలు ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే విధంగా ఆలోచించాలని సాలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సత్యవతి అన్నారు. పి. కొనవలస గ్రామంలో పొలం పిలుస్తోంది అనంతరం రైతులతో మాట్లాడుతూ రైతులు అనవసరంగా దుబ్బు గుళికలు వంటి వాటిపై అదనపు ఖర్చులు పెడుతున్నారని వ్యవసాయ శాఖ సూచనలు తీసుకుని సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. అనంతరం పనుకోవలస విశ్వనాధపురం రైతులకు యూరియా పంపిణీ పరిశీలించి విచక్షణ రహితంగా యూరియాను వాడొద్దని ప్రస్తుత సాగు అవసరాలకు సరిపడా యూరియాను మాత్రమే రైతులకు తీసుకుని వెళ్లాలని తదుపరి దఫా కోసం మరల ఎరువులు వస్తాయని ఆందోళన పడవద్దని తెలిపారు. అనంతరం ప్రకృతి సేద్య సిఆర్పి విజయ్ ఆధ్వర్యంలో బొబ్బిలి వలస లో ప్రకృతి సేద్య రైతు మృత్యుంజయరావు తయారుచేసిన 600 లీటర్ల ఘనజీవామృతం తయారీలో పాల్గొన్నారు ఘన ద్రవ జీవామృతల తయారీ ద్వారా రసాయన ఎరువులు పై భారం తగ్గించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కే .తిరుపతిరావు గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రకృతి సేద్య అధికారులు పాల్గొన్నారు.