
జాతీయ పౌష్టిక మాసొత్సవా లలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం, తోనాం పంచాయతీ, ముంగివాని వలస గ్రామంలో ధరణి ఎఫ్. పి. ఓ ఆఫీసులో దీక్షా మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో, విశాఖపట్నం కి చెందిన లీ ఫార్మసీ కంపెనీ సహకారంతో డైరెక్టర్ లీలారాణి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిర్వహించారు. అంగన్వాడి కార్యకర్తలకు పరిశుభ్రత ఆహారం పై శిక్షణ కల్పించారు. సుమారు 250 మంది గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లీ ఫార్మసీ డైరెక్టర్ లీలారాణి, దీక్ష మహిళ వెల్ఫేర్ సొసైటీ సీఈవో ఎల్. శాంతి, ఐ. సి. డీ. ఎస్ పిఓ ఏం.మంగమ్మ, సూపర్ వైజర్లు ఎన్ .లీలావతి,జి. అనురాధ, ఆర్ ధనలక్ష్మి, ఎస్ లక్ష్మి, ధరణి ఎఫ్. పి.ఓ సీఈవో ఎం. భీమారావు,బి. వెంకటరమణ పాల్గొన్నారు.