
చిన్న శ్రీను జన్మదిన వేడుకలలో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర
విజయనగరం,సెప్టెంబర్ 4,(4th Estate News)
గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వై.యస్.ఆర్.సి.పీ.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జన్మదినం సెప్టెంబర్ 5వ తేదీ సందర్భంగా ముందుగానే జరిగిన యూత్ తో వేడుకలు కొత్తపేట నీళ్ల ట్యాంక్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ హాజరై కేకు కటింగ్ చేసి యూత్ తో కొంతసేపు ఆనందంగా గడిపారు. తదనంతరం వారందరికీ డిన్నర్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, యూత్ పాల్గొన్నారు.