
కర్రివలస,సెప్టెంబర్ 4,(4th Estate News)
రైతులు ఒకే పంట వేసుకోవడం కంటే మొక్కల మధ్య ఖాళీ నేలను అంతర పంటలు వేసుకుని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ముఖ్యంగా పత్తి మొక్కజొన్న వంటి పంటల లో వరుసల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉంటాయని ఈ ఖాళీలలో అపరాలు చోడి వేరుశనగ వంటి పంటలను వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడమే కాకుండా కలుపు ఉధృతి తగ్గుతుందని జీవ వైవిధ్యం పెరుగుతుందని తెలిపారు. కర్రివలస లో రైతులు లండ నారాయణరావు లంక రమేష్ చిరంజీవి దాసరి గోవింద వంటి పదిమంది రైతులు వేసిన అంతర పంటలను పరిశీలించారు. పొలం పిలుస్తోంది లో భాగంగా పంటలను పరిశీలిస్తూ పది ఎకరాల మొక్కజొన్న చుట్టూ ర ఒక వరుసలో గంటెలు ఒక వరుసలో తెల్లజొన్న పత్తి పంట మధ్యలో చోడి పంట గోంగూర మినుములు వేరుశనగ పంటలతో పాటుగా గట్ల మీద మునగ ఆముదం కంది అరటి బొప్పాయి వంటి పంటలను వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నట్లుగా రైతులు తెలిపారు. కలుపు ఉధృతి బాగా తగ్గిందని పక్షులు తూనీగలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ అంతర పంటల ద్వారా కలుపు నివారణ అదనపు ఆదాయం పొందడమే కాకుండా నేల లోపల బయట కూడా జీవ వైవిధ్యం పెరిగి మిత్ర పురుగులు పెరుగుతాయని నేలలో వానపాములు వృద్ధి బాగా జరుగుతుందని ఉపయోగపడే సూక్ష్మజీవులు వృద్ధి చెంది పంటకు కావలసిన అనేక పోషకాలు లభించి ఆరోగ్యవంతమైన పంట పండుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య ఎం టీ యశోదమ్మ సురేష్ పాల్గొన్నారు.