
పాచిపెంట రూరల్,ఆగస్టు 30,(4th Estate News)
కుటుంబం ఆర్థికంగా గాని సామాజికంగా గాని అభివృద్ధి చెందాలంటే మహిళలదే కీలక పాత్ర అని కృషి విజ్ఞాన కేంద్రం రక్త కుంట భాయ్ గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త ఉమా జ్యోతి అన్నారు. పాచిపెంట వ్యవసాయ కార్యాలయంలో గిరిజన మహిళలు ఆర్థిక అభివృద్ధికి పలు సూచనలు అందించారు. పదిమంది గిరిజన మహిళలు వచ్చినట్లయితే వారికి చిరుధాన్యాలు వాటి ఉత్పత్తులు విలువల పెంపు అలాగే అటవీ ఉత్పత్తులకు విలువల జోడింపు వంటి పలు అంశాలపై ఉచితంగా శిక్షణ ఇస్తామని గ్రామైక్య లేదా మండల సమైక్య ద్వారా కృషి విజ్ఞాన కేంద్రానికి దరఖాస్తులు పెట్టుకోవచ్చని తెలిపారు. చింతపండు బ్లాక్ ల తయారీ తేనెటీగల పెంపకం చిరుధాన్యాలతో కురుకురే బిస్కెట్లు తయారీ వంటి వాటిపై కూడా పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తామని కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు శతాభి సర్పంచ్ రామయ్య పాల్గొన్నారు.