
భీమిలి,ఆగస్టు 29,(4th Estate News)
*అంగ రంగ వైభవంగా ప్రారంభం అయిన చిన్న శ్రీను పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ వేడుకలు*
భీమిలి ఫుడ్ బాల్ గ్రౌండ్ లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ. పి. జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.తన కుమార్తె అయిన *చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 4 వరకూ జరుగు చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ ను తాను స్వయంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు
1) మొదటి స్థానం బహుమతి : 50 వేలు
2) రెండవ స్థానం : 30 వేలు
3) మూడవ స్థానం బహుమతి : 15 వేలు
బహుమతి ప్రదానం చేస్తామని చెప్పారు. అదేవిధంగా క్రీడా కారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఉపయోగ పడతాయన్నారు. జీవితంలో ఉన్నత స్థాయి చేరడానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడలు వల్ల దేహధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, వార్డు కార్పొరేటర్లు, వార్డు ఇంచార్జిలు, వార్డు పార్టీ ప్రెసిడెంట్స్, సోషల్ మీడియాసభ్యులు, నాయకులు, కార్య కర్తలు, స్థానిక ప్రజలు, క్రీడాకారులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.