
సాలూరు,ఆగస్టు 21,(4th Estate News)
2025-2026 కి గాను వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఐటిఐ కళాశాలలో మూడో విడత కౌన్సెలింగ్ జరగనుంది.iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆగస్టు 20 నుండి 26 వ తేదీ లోపు పైన తెలిపిన వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకొని తదుపరి జిల్లాలో దగ్గర్లో ఉన్న ఏదైనా ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఐటిఐ లో గాని వెరిఫికేషన్ చేసుకొవాలి… లేకపోతే జాబితా లో తమ పేరు కనబడదు…ఇంకా కౌన్సిలింగ్ లో పాల్గొనడానికి అర్హత కోల్పోతారు. కనుక 27వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వ ఐటిఐలకు ఆగస్టు 29న ప్రైవేట్ ఐటిఐ లకు ఆగస్టు 30న కౌన్సిలింగ్ ఉండును. కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు కాలేజీలో సర్టిఫికెట్లతో రావాలని సాలూరు ఐటీ కాలేజీ ఫ్రెండ్స్ డి శ్రీనివాసాచారి తెలిపారు. అభ్యర్థులు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మార్చరాదు. టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధార్ కార్డులోని వివరములు ఒకేలా ఉండాలి.మరిన్ని వివరాలకు 9052508903,8886789002 నంబర్లకు సంప్రదించగలరు.