

బిహార్ రాష్ట్రం లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.కావున దేశంలో బీజేపీ కూటమికి తిరుగులేదని, పోటీ లేదని మరొకసారి బీహార్ ఎన్నికలు నిరూపించింది . ఈ గెలుపుని పురస్కరించుకుని సాలూరు టౌన్ బోసుబొమ్మ జంక్షన్ లో కేక్ కట్ చేసి నరేంద్ర మోది చిత్ర పటానికి పాలతో అభిషేకం చేయడం, బాణసంచా కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ హేమానాయక్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వర రావు, జిల్లా జనరల్ సెక్రటరీ గొర్లె భానోజీరావు, జిల్లా ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ రెడ్డి సింహాచలం, జిల్లా నాయకులు మేకల జ్యోతి,ముదరక శ్రీను, సాలూరు పట్టణ అధ్యక్షులు వానపల్లి మురళీకృష్ణ, పట్టణ జనరల్ సెక్రటరీలు వంగపండు అప్పలనాయుడు, రాజన సాయికిరణ్, మణికంఠ, మామిడిపల్లి బీజేపీ నేతలు బూస శ్రీనివాసరావు, దుర్గా, సాలూరు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
4 Th Estate News,సాలూరు
