రసాయనాలు వాడకం తో దుష్ప్రభావాలు

సాలూరు వార్తలు

 

సాలూరు టౌన్ పాత బస్టాండ్ వద్ద ఉన్న అరటి పళ్ళ దుకాణాల్లో హ్యూమన్ రైట్స్ ప్రతినిధి నైన శ్రీనివాసరెడ్డి పిర్యాదు మేరకు జిల్లా ఆహార భద్రత శాఖ అధికారి వినోద్ తనిఖీలు చేసి వారి వద్ద నుంచి అరటి పళ్ళ శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కి పంపిస్తున్నామని అన్నారు.వచ్చిన ఫలితాలు ఆధారంగా చర్యలు ఉంటాయి అన్నారు.అరటి పళ్ళును త్వరగా మగ్గటానికి ఎక్కువగా వాడే రసాయనం కాల్షియం కార్బైడ్ , ఇథిలిన్ వంటి వాటిని వ్యాపారులు తీసుకొచ్చిన పచ్చికాయలపై వేసి వేగంగా పండిపోవడానికి ఉపయోగిస్తారు. కాల్షియం కార్బైడ్ ద్వారా విడుదలయ్యే వాయువులు ఆరోగ్యానికి హానికరం కావున ప్రభుత్వం వీటి వాడకంపై నిషేధం విధించింది.కాల్షియం కార్బైడ్ వాడిన పండ్లు తినడం కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సహజంగా పండిన అరటిపళ్ళు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వ్యాపారులు ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత రసాయనాలను వినియోగిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం పట్టణంలోని చిన్నబజార్ వడ్డీవీధి దిమ్మ వద్ద ఉన్న ఖార్ఖనా ను తనిఖీ చేసి ప్యాక్ చేసి ఉన్న వాటిలో కచ్చితంగా ఫుడ్ లైసెన్స్ వివరాలతో పాటు తయారీ , ఎక్సపెయరి తేదీలతో లేబుల్స్ ఉండాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని అన్నారు. అదేవిధముగా ఆహార పదార్థాలలో వంట సోడా, రంగులను వాడకూడదని, వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా వ్యవహారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *