

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మాజీ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గత ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ను నిర్మించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తోంది… ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న బోసుబొమ్మ వద్ద కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టారు. సాలూరు విద్యార్థులు, యువత, మేధావులు, వృద్ధులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.ఈ కార్యక్రమం లో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర,వైసీపీ నేతలు వంగపండు అప్పలనాయుడు,గిరి రఘు తో పాటు అధిక సంఖ్యలో నేతలు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
