
4th Estate News,సాలూరు
సాలూరు విద్యా రంగంలో అప్పటికి… ఇప్పటికీ …ఎప్పటికీ… ఎవర్ గ్రీన్ స్కూల్ అంటే లయన్స్ క్లబ్ అనడం అతిశయోక్తి కాదేమో. పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 9 వ తరగతి విద్యార్థి ముగడ నవనీత్ గురువారం విజ్జి స్టేడియంలో త్రిపుల్ జంప్ పోటీలో జిల్లా స్థాయిలో మేటీగా నిలిచాడు… రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన శుభ సందర్భం లో హెడ్మాస్టర్ అశోక్ కుమార్, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ అభినందనలు తెలిపారు.
