

4th Estate News,మామిడిపల్లి
పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, మామిడిపల్లి యూనిట్ లో అన్నంరాజు వలస గ్రామం లో రైతులుకు ఆర్గానిక్ నాచరల్ ఫార్మింగ్ బయో ఇన్పుట్స్ అవుట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ లో అన్ని రకాల ప్రకృతి వ్యవసాయ కాషాయాలు, ద్రావణాలు, దోమపోటు కంట్రోల్ చేయుటకు పసుపు నీలం ప్లేట్లు, ద్రవజీవామృత కవర్లు, ఘన ద్రవ జీవామృతాలు, నవధాన్యాలు, ఆర్ డి ఎస్ విత్తనాలు, కూరగాయలు, దేశి విత్తనాలు, ఎస్ టు ఎస్ కిట్లు అందుబాటులో లభించును అని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రంగారావు , కుమారి, సూరిబాబు బయో ఇన్పుట్ సెంటర్ ఓపెన్ చేసి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.వ్యవసాయానికి రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వలన ప్రజలు ఆరోగ్యాలు పాడవుతున్నాయని, ఎటువంటి రసాయనిక ఎరువులు లేని ఆహర పదార్ధాలు తినడం వలన ఆరోగ్యం బాగుంటుందని, భూమి సారవంతం కూడా పెరుగుతుందని, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో రైతులు రైతు సేవా కేంద్రం ప్రతినిధి, గ్రామ పెద్దలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరయ్యారు.
