

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం ,మామిడిపల్లి గ్రామంలో వరిలో వచ్చే సుడి దోమ నివారణ కొరకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులు సామూహికంగా తూటి కాడ కషాయం తయారీ జరిగింది. ఈ సుడి దోమ లేదా దోమ ఎక్కువగా వరిలో చిరుపొట్ట దశ, పొట్టదశ , ఈనుక దశ లో ఎక్కువగా వస్తుంది అని వాతావరణం లో ఇరవై అయిదు డిగ్రీల సెంటిగ్రేట్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ సుడి దోమ వృద్ది చెందుతుంది అని నత్రజని ఎరువులు ఎక్కువ గా వాడటం వలన దోమ ఉదృత పెరుగుతుందని, సుడి దోమ వలన ఆర్ధిక నష్టపరిహారం జరుగుతుందని, వీటికి రాజీలేని సూత్రాలు వరి చిగుళ్ళు కట్ చేసి వరుస క్రమ పద్దతిలో నాట్లు వేసుకోవటం ప్రతి రెండు మీటర్లుకు ఇరవై సెంటిమీటర్లు కాలిబాటలు తీసుకోవటం వలన సుడి దోమ ఉదృత పెరగకుండా ఉంటుందని, ఈ సుడి దోమ నివారణకు 10 కేజీల తూటి కాడ ఆకులు పదిహేను లీటర్లు నీటిలో నాలుగు పొంగులు వచ్చేటట్లు ఉడికించి చల్లార్చిన తరువాత 15 లీటర్లు దేశి ఆవు మూత్రం కలిపి వడపోసుకుని 5 నుండి 6 లీటర్ల తూటికాడ కషాయాన్ని కుంకిడి కాయలు రసం,100 లీటర్ల నీటిలో కలిపి వరి మొదల్లు పయిన పడేలా పిచికారీ చేయటం వలన తూటికాడ లో ఆల్కళాయిడ్లు ఎక్కువగా ఉండటం వలన వరిలో సుడిదోమ నివారణ అవుతుందని, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరయ్యారు.
