
సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ
సాలూరు మండల పరిధిలో పెదపదం గ్రామంలో ఇటీవల సంభవించిన తుఫానుకు నష్టపోయిన వరి పంటను సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని, రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం కలిగే విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కెవికె రస్త కుంటా భాయ్ నుండి హాజరైన శాస్త్రవేత్తలు ఉమ,అను,వీణ పెద్ద బోరబంద, పెదపదం గ్రామాలు పరిశీలించాక వరి పొలంలో అధిక నీరు పిలవకుండా పిల్లకాలువలు ఏర్పాటు చేసుకోవాలని, వరికి మాని వండు తెగులు సోకకుండా ఎకరా కు 200 ఎంఎల్ ప్రొఫికానిజోల్ వాడాలని తెలిపారు. ఏఓ శిరీష,సిబ్బంది పాల్గొన్నారు.
