నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన సందర్భంగా శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ధర్మశాలలో 100 మంది నారాయణ లకు అమృత కలశాలు (బియ్యం, నిత్యవసర సరుకులు, రగ్గులు) డాక్టర్ వాడాడ గణేశ్వరరావు, డాక్టర్ ఆరిశెట్టి మోహన్ రావు, సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు , భగవాన్ సత్యసాయి బాబా వారి సేవకులు జగదాన మోహన్ రావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది... ఈ సందర్భంగా శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవాన్ బాబా వారి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యుల, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు..
ముఖ్య అతిథిగా పాల్గొన్న సాలూరు ప్రాణదాత చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ వాడాడ గణేశ్వర రావు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందు ఉండే శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యంలో చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇంకా ఇంకా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు..
సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ ఒక పాఠశాల యాజమాన్యం వారు ఇటువంటి చక్కని సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఆశ్చర్యంగా ఉందని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో కూనిశెట్టి భీమారావు, భగవాన్ సత్యసాయి భక్తులు, శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.