

నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భం గా ఎంఓ పీ.హెచ్. సీ.మామిడిపల్లి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి.శివకుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.శుభ్రత పట్ల అవగాహన కల్పించారు.శుక్రవారం జిల్లా పరిషత్ హై స్కూల్,మామిడిపల్లి లో పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.క్రమశిక్షణ పాటిస్తూ… పట్టుదలతో చదివితే ఉన్నత స్థాయి కి చేరేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
