
పార్వతీపురం మన్యం జిల్లా,
సాలూరు టౌన్ పరిధిలో
బంగారమ్మ పేట కి చెందిన బొత్స నవీన్, కోడూరు కార్తీక్, మడుగులు వంశీ లను నవంబర్ 13 న సాలూరు టౌన్ నుండి జీగిరాం వైపు ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా స్కూటీతో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తారసపడ్డారు. వారిని విచారించి చెడు అలవాట్లకు బానిసలుగా మారి నవంబర్ 9న స్క్రూ డ్రైవర్ జాకీ రాడ్ ఉపయోగించి... ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న నగలు, సొమ్ము దోచుకున్నట్టు తెలిపారు. 32వేల నగలు, 6.5 గ్రాముల బంగారం స్వాధీనపరుచుకున్నారు. సాలూరు పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఇలా శాంతి భద్రతలకు ప్రజల ధన మాన ప్రాణాలకు హాని కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు, రౌడీ హిస్టరీ సీట్స్ ఓపెన్ చేస్తామని సాలూరు పోలీస్ వారు హెచ్చరించడం జరిగిందని సాలూరు టౌన్ సిఐ బొమ్మిడి అప్పలనాయుడు తెలిపారు.