
మాజీ డిప్యూటీ సీఎం పిడిక. రాజన్న దొర
రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, అప్పట్లోనే ఏడు కళాశాలలో నిర్మాణాలు పూర్తిచేసి ఐదింటిలో తరగతులు కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. 10 మెడికల్ కళాశాలలో 30 శాతం నుండి 70 శాతం వరకు పూర్తయ్యాయని వీటిపై వారు శ్రద్ధ చూపిస్తే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నా కూటమి ప్రభుత్వం చేయలేదని అన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని పార్టీలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఇందులో భాగస్వాములు అవుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక.రాజన్నదొర అన్నారు. అవసరమైతే ప్రైవేటీకరణ పై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని, వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలంతా ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
ముందుగా సాలూరు పట్టణంలో జరిగిన ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్,బొర్రా చిన్నా విగ్రహాలకు, టౌన్ నడిబొడ్డున ఉన్న మాజీ సీఎం దివంగత మహానేత డాక్టర్.వైయస్సార్ విగ్రహానికి మాజీ డిప్యూటీ రాజన్నదొర , వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు.