దళాయి వలస వాటర్ ఫాల్స్ ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు వార్తలు

సహజ సౌందర్యానికి నిలయమైన గిరిజన గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకుట్టి గ్రామ సమీపంలో దళాయివలస వద్ద అడప రాయి వాటర్‌ఫాల్స్‌ను నవంబర్ 11, మంగళవారం గిరిజన సంక్షేమ, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
సాలూరు నియోజకవర్గంలో ఉన్న చాలా జలపాతాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు
సాలూరు, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.. కొండలు, జలపాతాలు, సహజసిద్ధమైన వీచే చల్లనిగాలితో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయని,
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం పార్వతీపురం మన్యం జిల్లా
పర్యాటక అభివృద్ధితో గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు తాసిల్దార్ నీలకంఠ రావు ఎంపీడీవో పార్వతమ్మ, నేతలు కార్యకర్తలు, పరిసర గ్రామ ప్రజలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *