

సాలూరు టౌన్ పరిధిలో బంగారమ్మ పేట కు చెందిన డి. వెంకటరమణ (57) ఇంట్లో 7 గ్రాముల బంగారు ఆభరణాలు 37 వేల రూపాయల సొమ్ము గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నవంబర్ 7వ తారీఖున డి. వెంకటరమణ, లక్ష్మి దంపతులు విశాఖపట్నం పెందుర్తి ఏరియాలో నివాసముంటున్న తమ కుమార్తె ఇంటికి అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమానికి వెళ్లారు. తదుపరి నవంబర్ 9 న రాత్రి 12 గంటల సమయంలో ఇంటిలో దొంగలు పడ్డారని పరిసర ప్రాంత వ్యక్తి శేఖర్ చరవాణి ద్వారా సమాచారం అందించినట్టు, తదుపరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సాలూరు టౌన్ సిఐ బొమ్మిడి అప్పలనాయుడు మీడియాకు తెలిపారు.
4th Estate News, salur,4thestate.in
