
మండలంలో సుమారు నాలుగువేల ఎకరాలకు పైగా పత్తి పంట ఉందని నీటి సదుపాయం ఉన్న రైతులు పత్తి తీసివేసి మొక్కజొన్న పంటకు సిద్ధం చేస్తున్నారని అయితే ఇటీవల కురిసిన వర్షపు నీరు ఇంకా కొన్ని రోజులు నేలలో తేమను నిలుపుతుందని పత్తి పంటను కొనసాగించే రైతులు కొన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పత్తి మరల చిగురించేటట్టు చేసి మంచి దిగుబడిని పొందే విధంగా ఒక ప్రయోగాన్ని కూణం బంధవలస గ్రామంలో రైతు అధికార్ల కృష్ణ , మహిళా రైతు దేవి పత్తి క్షేత్రాలలో చేస్తున్నామని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. ముందుగా పేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేసి తర్వాత పంచగవ్య ఆపై దశ పత్ర కషాయం మీనామృతం మరలా పంచగవ్య వారం వ్యవధిలో పిచికారి చేసినట్లయితే రసం పీల్చు పురుగులు నివారించబడి పంచగవ్య మీనామృతం పిచికారి ద్వారా కొత్త చిగుర్లు వచ్చే అవకాశం ఉందని అలాగే వచ్చే పత్తి కూడా నాణ్యమైనదిగా ఉంటుందని భావించి ఈ ప్రయోగాన్ని మండలంలో ఆరుగురు రైతుల క్షేత్రాలలో జరుపుతామని తెలిపారు. ఈ ప్రయోగం సఫలమైతే పత్తి పంటను జనవరి నెల వరకు కొనసాగించే రైతులకు మేలు గా ఉంటుందని తెలిపారు. అనంతరం చెరుకుపల్లి గ్రామంలో వరి పంటను పరిశీలించారు. ప్రస్తుతం వరి పంటకు కంకి నల్లి ఆశించిందని, దానివలన కంకిలో కొన్ని గింజలు పాలు పోసుకోవడం లేదని దీని నివారణకు ప్రోఫినోపాస్ మందును ప్రాఫి కొన్నజోల్ మందుతో కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ విజయ్ ఐసిఆర్పి కుమార్, రైతులు పాల్గొన్నారు.
4thestate.in,pachipenta