4th Estate News, (సాలూరు)
బంకించంద్ర చటర్జీ వందేమాతరం గేయం రచించి నవంబర్ 7 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సాలూరు నియోజకవర్గ బిజెపి నేతల ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు సుమారు 700 మందికి పైగా పాల్గొని వందేమాతరం గీతాన్ని ఆలపించేలా కార్యక్రమం జరగనుందని జనరల్ సెక్రెటరీ మాజీ నియోజకవర్గ కన్వీనర్ జి.భానోజీ రావు,మన్యం జిల్లా బిజెపి వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వరరావు, ఓ బి సి మోర్చా అధ్యక్షులు జీగిరాం కు చెందిన రెడ్డి సింహాచలం, ఎస్ టి మోర్చా మన్యం పార్వతీపురం జిల్లా అధ్యక్షులు జిల్లా వి. హేమానాయక్ తెలిపారు.ప్రతి ఒక్కరూ వందేమాతరం గేయాన్ని ఆలపించాలని కోరారు.