
4th Estate News,(భీమిలి)
శ్రీ అయ్యప్పస్వామి సేవా పీఠంలో గురువారం అయ్యప్ప మండల దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం,లక్ష్మీపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు కలశం తో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అయ్యప్ప స్వామి సేవా పీఠం ఆధ్వర్యంలో నిర్మించిన అన్నదానం బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప శుభ సూచకమని ఆమె తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం చూస్తుంటే ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో తాను ఉన్నట్లుగా అనిపించిందని తెలిపారు.
