గ్రామ సంరక్షణ నిధి ఆధ్వర్యంలో కోజాగరి కార్యక్రమం

సాలూరు సమాచారం

4th Estate News,పాంచాలి

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం, పాచిపెంట మండలం లో
పాంచాలి గ్రామంలో
కార్తీక మాసం సందర్బంగా గ్రామ సంరక్షణ నిధి ఆధ్వర్యంలో కోజాగరీ కార్యక్రమం..గ్రామ వికాస్ గొడుగు క్రింద
చంద్ర కిరణం అమృత దార..వశిష్ఠ మహర్షి వీధిలో ( శివాలయం దగ్గర ) కశ్యపు మహర్షి వీధిలో ( వేప చెట్టు దగ్గర ) నిర్వహించడం జరిగింది…
ఇక్కడ చంద్ర కిరణ అమృత దార కార్యక్రమం అనగా…
క్షీరసాగర్ మథనం సమయంలో కార్తీకమాసం నిండు పౌర్ణమి సమయానికి దేవతలకు క్షీరసాగర్ నుండి అమృతం లభించును,
లభించున అమృత క్షీరంను దేవతలు త్రాగి అమరలు అయ్యారు.. అదే సమయంలో చంద్రుడు కూడ తన కిరణంలతో ఆకర్శించి…తన కిరణం ద్వారా మానవ శరీర ఉనికికీ ఆయు బలం వీర్యం తేజస్ యుగ యుగాలు నుండి కార్తీక పౌర్ణమికు శక్తి ప్రకాష్ ఉజ్వలం చంద్రుని వెన్నెల కిరణంల ద్వారా మానవుడుకీ లభిస్తుంది..
అలాగే..
కఫ, వాత , పిత్త తత్వం శరీర దోష నివారణకు ఔషాదం వలె వెన్నెల కిరణంలలో పాలు, బెల్లంతో కాచిన క్షీరం త్రాగడం వలన యుగ యుగాలు నుండి మనిషికీ ఆరోగ్యం లభిస్తుంది..
ఈ కార్యక్రమం లో
యోగా మాతాజీ అరిశెట్టి ఇందుమణి,
ఆర్. ఎస్. ఎస్. ప్రచారక్
రాంజీ ,
ఆంధ్రప్రదేశ్ గోశాల సంయోజకులు
వీరి సమక్షంలో
వెన్నెల కిరణం కింద పాలు కాచడం,పంపిణి ,హోమం,
దీపోత్సవం,ప్రవచనం,
జ్వాల తోరణం,ఆటలు,గానం,
నిత్య సాధన చంద్రిక వి హెచ్. పి. ముద్ర వేయించిన పుస్తక పఠనం పంపిణి.. మొదలగు జన హిత కార్యక్రమాలు జరిగాయి…
ఆచార్యలు,శిక్షార్డులు,
గ్రామ స్త్రీలు,అయ్యప్ప స్వామి భక్తులు,గ్రామ పెద్దలు
ఈ కార్యక్రమం కి హాజరై జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *