రైల్వే కోడూరు,అన్నమయ్య జిల్లా,4th Estate News
ఆర్ ఎమ్ టి యు అన్నమయ్య జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దాసరి జయచంద్ర పంచాయతీ ఆఫీస్ నందు కార్మిక సమస్యల గురించి మాట్లాడుతూ పంచాయితీ,గ్రీన్ అంబాసిడర్లకు, మూడు నేలల జీతాలు , ఆఫీస్ స్టాప్ మరియు మేస్త్రీలకు ఆరు నేల పెండింగ్ జీతాలు చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు!
గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ అంబాసిడర్లకు మరియు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ ఆర్ యం టి యు అన్నమయ్య జిల్లా కన్వీనర్, దాసరి జయచంద్ర కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ,
పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణం చెల్లించాలని, కనీస వేతనం 21,000,ఇవ్వాలి.గ్రామపంచాయతీ కార్మికులకు హైకోర్టు 2015 వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకు అమలు చేస్తున్న ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ 6000 ఇవ్వాలి. 132వ జి.ఓ అమలకు 551 జీవో ఆటంకముగా ఉన్నది. దీనిని రద్దుచేసి, 132, 57 జీవోలు: ఆమలు, టెండర్లు రద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, బకాయి జీతాలు చెల్లింపు, పనిముట్లు, రక్షణ పరికరాలు, యూనిఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెలు, టవల్స్ తదితర సమస్యలను చేపట్టడం గురించి గ్రామ పరిశుభ్రత ప్రజారోగ్యం పర్యావరణాన్ని కాపాడేందుకు మా ప్రాణాలను పణంగా పెడుతున్నాము. విష వాయువులు మా ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తున్నాయి ప్రజలకు ప్రభుత్వం తరపున సేవలు చేస్తున్నాము. అయినా ప్రతి నెల జీతాలు ఇవ్వడం లేదు. సుమారు 03 నుండి 06 నెలల జీతాలు: బకాయిలు ఉన్నాయి. స్వచ్చ భారత్ కార్మికులకు కుడా రెండు నుండి 11నెలలు బాకాయిలు ఉన్నాయి. దీనితో మా కుటుంబాలు పస్తులు తో జీవించాల్సి
వస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా జీతాలు కూడా పెంచలేదు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, కరెంటు, ఆర్టీసీ చార్జీలు, విద్యా వైద్య ఖర్చులు, ఇంటి కిరాయిలు అనేక చెట్లు పెరిగాయి. కావున మా బాధలను అర్థం చేసుకొని బకాయి జీతాలు వెంటనే చెల్లించడంతోపాటు మా జీతాలను 21 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఏళ్లతరబడి వెట్టిచాకిరి చేస్తున్నా ప్రభుత్వాలు మా గోడు పట్టించుకోవడం లేదు. గ్రామపంచాయతీ కార్మికులకు గౌరవ హైకోర్టు 2015 వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులను నిర్ధాక్షణంగా. తొలగిస్తున్నారు. వెంటనే కార్మికుల తొలగింపు నిలుపుదల చేసి హైకోర్టు తీర్పును అమలు చేయాలి. కనీస వేతనాలు, గుర్తింపు కార్డు, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా పథకాలను అమలు చేయాలని 1999 లో జీవో ఎంఎస్ నెంబర్ 551 నీ జారీ చేశారు. 2019 ఫిబ్రవరి 8న ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 132 సహితం అమలు జరగడం లేదు. ఇస్తున్న నామమాత్రపు జీతాలు కూడా ప్రతి నెల ' ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్ లు పెడుతున్నారు. ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. లేని యెడల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాబోయే రోజులలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.
అలాగే ప్రతి కార్మికులకు
1. బకాయి జీతాలు వెంటనే చెల్లించి కార్మికుల కుటుంబాలను పస్తుల నుండి కాపాడాలి.
2. గ్రామపంచాయతీ కార్మికులు మరియు గ్రీన్ అంబాసిడర్లకు కనీస వేతనం నెలకి 20000 రూపాయలు ఇవ్వాలి..
3. మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీస్ అంబాసిడర్లకు కూడా నెలకు 6000 రూపాయలు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ వర్తింపచేయాలి..
4. గ్రామపంచాయతీ కార్మికులకు హైకోర్టు 2015 వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. కార్మికుల తొ తొలగింపులు ఆపాలి.
5. జీవో ఎంఎస్ నెంబర్ 551 ని రద్దు చేయాలి. 132 జీవోను అన్ని స్థాయిల్లో అమలు చేయాలి.
6. బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి.
7. గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు అధికారుల వేధింపులు నివారించి ఉద్యోగ భద్రత కల్పించాలి. 8. పనిముట్లు రక్షణ పరికరాలు యూనిఫామ్ చెప్పులు సోపులు నూనెలు టవల్స్ సకాలంలో అందించాలి.
9. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు 10 లక్షలు, సాధారణంగా మృతి చెందిన కార్మికులకు ఐదు లక్షలు, ఇల్లు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలి... ఈ కార్యక్రమంలో రాజేష్, పెంచలమ్మ, పుల్లయ్య, వెంకటేష్, గజ, పెంచలయ్య, కృష్ణవేణి, కిషోర్, సుధాకర్, వెంకటేష్, సుబ్బారెడ్డి, మహేష్, శివ ,రాణి, తేజ,గంగయ్య ,సుబ్రహ్మణ్యం, పెంచలయ్య, జయరామయ్య, గంగయ్య, రమణ, వెంకటయ్య. మొదలగు కార్మికులు పాల్గొన్నారు.