

4th Estate News, (Salur)
సాలూరు లో సారిక వీధి లో నివాసం ఉంటున్న స్థానిక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బూర్లే పార్థసారధి, లీల దంపతుల కుమారుడు బూర్ల ప్రవీణ్ కుమార్ బిటెక్ పూర్తి చేసి, తరువాత పై చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్, ఇతరత్రా మార్గాలలో కష్టపడి డబ్బులు ఏర్పాటు చేసుకుని యూకే లో ఎమ్మెస్ చేయడానికి వెళ్ళాడు. ఎమ్మెస్ పూర్తి అయి ప్రస్తుతానికి లండన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి ప్రవీణ్ తలనొప్పి ఎక్కువగా ఉండటంతో హాస్పటల్ కి వెళ్ళగా అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షల్లో ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బ తిన్నాయని గుర్తించారు. అతని వీసా గడువు ఫిబ్రవరితో ముగియనుంది. కాగా, ప్రవీణ్ ఇక్కడకు రావడానికి కూడా తన ఆర్థిక పరిస్థితి ప్రస్తుతానికి సరిగా లేనందున ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్థానిక నాయకుడు విక్రం రమణకు తెలిసిన వెంటనే తన స్నేహితుడు ,యూఎస్ఏ లో ఉంటున్న ఎన్ఆర్ఐ సాలూరు మెంటాడ వీధికి చెందిన సారిక ఉదయ్ జ్ఞానేశ్వర్ ను సంప్రదించి విషయం చెప్పిన వెంటనే స్పందించి యుఎస్ లో ఉంటున్న తన మిత్రబృందం కలిసి ప్రవీణ్ ను భారతదేశానికి తీసుకురావడానికి తగిన విమాన టికెట్లు, ఇతర ఖర్చులు నిమిత్తం 1 లక్ష 50 వేలు ఏర్పాటు చేశారు. ఆ నగదును విక్రమ్ రమణ, ఇతర వీధి పెద్దల చేతుల మీదుగా ప్రవీణ్ కుటుంబానికి అందజేయడం జరిగింది. వెంటనే స్పందించి అండగా నిలిచిన దాతలకు, స్థానిక నాయకుడు విక్రమ్ రమణకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
