నవంబర్ 1వ తేదీ శనివారం బొబ్బిలి ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో రైలు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికుల భద్రత కొరకు రైల్వే శాఖ వారు సూచించిన విధానాలు పాటించాలని కోరారు. ప్రమాదాలను అరికట్టాలని దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఆర్పిఎఫ్ పోలీసులు స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, మీ జీవితం చాలా విలువైనది ఒక తప్పటడుగు తో ప్రమాదాల బారిన పడవద్దని హితవు పలికారు. ప్రయాణికులు రైల్వే పట్టాలపై నడవరాదని ప్రమాదాల బారిన పడే అవకాశం అధికంగా ఉందని, ఓవర్ బ్రిడ్జిలు ద్వారా, రైల్వే శాఖ వారు అనుమతించిన దారుల్లో వారి గమ్యాన్ని చేరాలని, రైల్వే యాక్ట్ సెక్షన్ నెంబర్ 147 ప్రకారం రైల్వే పట్టాలు దాటుట నేరం దీనికి ఆరు నెలలు జైలు శిక్ష ,లేదా వెయ్యి రూపాయల జరిమానా కొన్నిసార్లు రెండు విధించవచ్చు. వేగం కన్నా ప్రాణం మిన్న అనే నానుడి ని గుర్తుపెట్టుకొని సౌకర్యవంతమైన సంతోషకరమైన జర్నీ చేయాలని అన్నారు. అదేవిధంగా ట్రైన్ ఎక్కిన సమయం, దిగే సమయం లో తగు జాగ్రత్తలు పాటించాలి అని అన్నారు.