
మాతాజీ కుమారి ఆరిశెట్టి ఇందు మణి వెల్లడి
ఓం నమః పూజ్య గురువులు యోగాచార్యులు రాపర్తి రామారావు దివ్య ఆశీస్సులతో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు అత్యద్భుతమైన అవకాశం ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొట్ట మొదటిసారిగా ఒక సంవత్సరం పీజీ డిప్లొమా యోగా కు ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులు, 6 నెలల డిప్లమా ఇన్ యోగా కు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. శిక్షణా తరగతులకు అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. మాతాజీ కుమారి ఆరిశెట్టి ఇందు మణి స్థాపించిన AIM RAMA YOGA TRUST (AMRYT-అమృత) వారికి ఆంధ్ర యూనివర్సిటీ వారి అనుమతి లభించింది. రెండు కూడా పార్ట్ టైం కోర్సులు! కావున రోజుకు రెండు గంటల సమయం కేటాయిస్తే సరిపోతుంది.... తమకు తామే కాకుండా ఉపాధి అవకాశాన్ని సమాజాభివృద్ధికి కూడా తోడ్పడి ఇటువంటి ఉత్కృష్టమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్: 9703595368,9515259161,9873741589 నెంబర్లను సంప్రదించవలసినదిగా కోరారు.