
* పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచండ్ర
. మూడు కోట్ల పదిలక్షలతో నిర్మించతల పెట్టిన పులిగుమ్మి మీదుగా బందలుప్పి తారు రోడ్డుకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర శంకుస్థాపన
పార్వతీపురం: ప్రజాస్వామ్యానికి అత్యధిక విలువలనిచ్చి, ప్రాధాన్యతచ్చి, దాన్ని రక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ రాజ్యాంగం లోని అంశాలను అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి మీదుగా బంధలుప్పి రోడ్డు పనులకు నాబార్డు కింద మంజూరైన రూ. 3.10 కోట్ల తో చేపట్టాల్సిన తారు రోడ్డు పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జిల్లాకు నాలుగు తారురోడ్లు మంజూరు కాగా అందులో రెండు రోడ్లకు రూ. 7.5కోట్ల నిధులు మంజూరు చేయించి పార్వతీపురం మండలానికి ఈ రెండు రోడ్లు కేటాయించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండో రోజు నుంచే అభివృద్ధి, సంక్షేమ పథకాల వైపు అడుగులు వేశారన్నారు దీన్ని ఓర్వలేని వైకాపా నాయకులు రోడ్లపైకి వచ్చి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారన్నారు. దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నారని, వారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో తప్పుడు ప్రసంగాలిస్తున్నారన్నారు. తెలుగు వాడు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో తెలుగువాడు ముందుండాలనే సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు అహర్నిశలు ఆలోచన చేస్తున్నారన్నారు. వైసిపి నాయకులతో ప్రజలకు పనిలేదని, జగన్మోహన్ రెడ్డి పిచ్చి పాలనపై ప్రజలు విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు జగన్ అవసరం లేదనే భావించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తూ ప్రజలకు తప్పుడు సందేశాన్ని అందజేస్తున్నారన్నారు. వీటిని ప్రజలు కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఎంతో చేరువలో ఉన్నాయన్నారు. వీటిపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలకు కావలసిన అన్ని వనరులు ఈ ప్రభుత్వ హయాంలో అందుబాటులో ఉన్నాయన్నారు. విశాఖపట్నం ప్రాంతాన్ని పరిశ్రమల హబ్ గా మార్పిడి చేసి అన్ని రాష్ట్రాల్లోని, దేశాల్లోని ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇతర దేశస్తులతో విశాఖ లో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు.
