
4th Estate News portal,4thestate.in
సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే ఆర్థిక సుస్థిరత తో పాటు శారీరక మానసిక ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని సఖీ సురక్ష హెల్త్ స్క్రీనింగ్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు దాసరి వీధి శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో శుక్రవారం ఈ కార్యక్రమం ప్రారంభించారు. మహిళలకు రక్తపోటు మధుమేహం,హీమోగ్లోబిన్ లెవెల్స్ ,స్త క్యాన్సర్ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ గిరిజన మహిళలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. క్రమం తప్పకుండా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు
.
