మొంథా తుఫాను వలన కలిగిన నష్టాన్ని కృషి విజ్ఞాన కేంద్రం రక్తకుంట భాయ్ శాస్త్రవేత్తల బృందం పాచిపెంట మండలంలో మోసూరు మరియు తాడూరు గ్రామాలలో పరిశీలించింది. ఈ బృందంలో సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అమృత వీణ పశుసంవర్ధక శాఖ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అను హోమ్ సైన్స్ శాస్త్రవేత్త శ్రీమతి వై ఉమాజ్యోతి ఉన్నారు. ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ తో కలిసి తుఫాన్ వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించారు గింజ మొలకెత్తకుండా రంగు మారకుండా ఉండాలంటే ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలని తెలిపారు పత్తి పంటకు నీరు తీసివేసి 25 కిలోలు యూరియా 15 కిలోల పొటాష్ వేసుకుని ప్రాఫి కొనజోల్ ఒక మిల్లీ లీటరు ఇమిడా క్లోప్రేడ్ 0.4 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. వరి పంటకు అవసరాన్ని బట్టి సస్యరక్షణ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు గోపాలకృష్ణ, ప్రకృతి సిద్ధ సిఆర్పి సురేష్ పాల్గొన్నారు.