

మోంథా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మోంథా తుఫాను ప్రభావంతో రానున్న 5 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.
మొంథా తుపాను నేపథ్యంలో అరకు పార్లమెంట్ పరిధి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను సంసిద్ధతపై ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి. అవసరమైనప్పుడు వివిధ శాఖలకు సంబంధించిన మానవ వనరులు, సామగ్రి, మెటీరియల్ పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణి పిలుపునిచ్చారు.
