భారత ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ దినోత్సవ సంబరాలు సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్స్ అసెంబ్లీ నీ నవంబర్ నెలలో నిర్వహించనున్నారు. సందర్భంగా సాలూరు మండల పరిధిలో మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో హై స్కూల్ విద్యార్థులకు క్విజ్ వ్యాసరచన ఉపన్యాసం పోటీలో నిర్వహించారు. సాలూరు మున్సిపల్ పరిధిలో గాడి వీధి హై స్కూల్ కి చెందిన విద్యార్థులు కొల్లి నందిని, ప్రభుత్వ హైస్కూల్ కు చెందిన నిహారిక, హై స్కూల్ కి చెందిన తనూజ నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో ఒకరిని విజయవాడలో జరిగే స్టూడెంట్స్ అసెంబ్లీకి పంపిస్తారని సమాచారం...ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎన్ జ్యోతి, ఎంఈఓ 2 వెంకట్రావు, సీనియర్ కెమిస్ట్రీ ఉపాధ్యాయులు కేవీ సత్యనారాయణ, గౌరీ శంకర్ కొల్లి గిరిబాబు, సోషల్ టీచర్లు సాంబమూర్తి ,భాస్కర్, రమణ పాల్గొన్నారు