
రబి సీజన్ లో విత్తనాలకు గుళికలు తయారుచేసి నాటుకున్నట్లయితే వర్షం లేకపోయినా సరే విత్తనం నేలలో పాడవకుండా ఉండి వర్షం పడిన వెంటనే తగినంత తేమ నేలలో చేరినప్పుడు మొలకెత్తి మంచి దిగుబడి ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రై షోయింగ్ కోసం ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు చిరుధాన్యాలతో కలిసిన 15 రకాల విత్తనాలను తయారు చేయడం జరిగింది ఈ విత్తనాలకు గుళికలను తయారు చేసి ప్రధాన పంటలో అంతర పంటలుగా కంచె పంటలుగా ఎర పంటలుగా వేసుకుంటే ప్రధాన పంటలో కలుపు రాకుండా ఉండడమే కాకుండా అదనపు ఆదాయాన్ని ఇస్తుందని కలుపు పంటలు నేలలో ఉండడం వలన అనేక రకాలైన సూక్ష్మజీవులు వృద్ది చెంది పంటకు కావలసిన పలు పోషకాలను అందించడం వలన ఆరోగ్యవంతమైన పంట తిరిగి అధిక దిగుబడి వస్తుందని తెలిపారు పాంచాలి రైతు సేవా కేంద్రంలో 15 రకాల విత్తనాలను రబి సీజన్లో డ్రై సోయింగ్ కోసం తయారు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ డ్రై షోయింగ్ విత్తనాలకు గుళిక వెయ్యటం వలన ఎలాంటి చీడపీడలు ఆశించవని, అదులుతో సంబంధం లేకుండా విత్తనాలను నాటుకోవడం వలన సమయం ఆదా అవుతుందని పలు రకాల విత్తనాలు ఒకే నేలపై ఉండడం వలన మిత్ర పురుగులు బాగా వృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మోహనకృష్ణ రైతులు పాల్గొన్నారు.