
సాలూరు మండల విద్యాశాఖ వారి కార్యాలయంలో చిరుద్యోగి చీపురుపల్లి గణేష్ పెద్ద కుమారుడు సత్య గంగాధర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు.. అనుకోకుండా సత్య గంగాధర కు రెండు కాళ్ళు ,రెండు చేతులు, పనిచేయకపోవడం, మరి కొన్ని అంతర్భాగాలు కూడా పనిచేయకపోవడం తో ఆసుపత్రి తీసుకువెళ్లి ఇరుగుపొరుగువారు చేసిన సహాయంతో తన కుమారుడిని బ్రతికించుకోగలిగారు.. కానీ చేసిన అప్పులు అలానే ఉన్నాయి.. నెలకు రెండుసార్లు వైజాగ్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.. అందుకే వారి వైద్య అవసరాల నిమిత్తం సామాజిక కార్యకర్త, శ్రీవేంకట విద్యాగిరి పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు తన చరవాణి గ్రూపుల ద్వారా సేకరించిన విరాళం మొత్తం స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా 60 వేల రూపాయల చెక్కును ఇటీవల చీపురుపల్లి గణేష్ కి అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ సత్య గంగాధర్ కి వైద్య అవసరాల నిమిత్తం డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు స్పందించి తన చరవాణి గ్రూపులు ద్వారా 60 వేల రూపాయలు సేకరించి ఇవ్వటం చాలా గొప్ప విషయం అని, ఇదేవిధంగా తోటి వారు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇదే విధంగా తమకు తోచిన సహాయ సహకారాన్ని అందించాలని, తెలియజేస్తూ డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు కరోనా సమయములోను ప్రతి రోజూ నిర్భాగ్యులకు, వారి ఇళ్ళకే భోజనం క్యారేజీలు ఇవ్వటం చాలా మంచి పని అని ఈ సందర్భంగా సాయి మాస్టర్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.