

జాతీయ ఆహార భద్రత, పోషక యాజమాన్యం (ఎన్ ఎఫ్ ఎస్ ఎన్ ఎం)-2025 పథకంలో భాగంగా ఎనిమిది వందల యాభై లీటర్ల వేప నూనె వచ్చిందని పూర్తి ధర 640 రూపాయలు రైతు చెల్లించవలసిన ధర 320 రూపాయలు అనగా 50% సబ్సిడీపై అందిస్తున్నామని కావలసిన రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబి సీజన్ లో మొక్కజొన్న 5000 ఎకరాలకు పైగా పడుతుందని కత్తెర పురుగు గుడ్డు దశ నుండే నివారణకు వేప నూనె ఎంతగానో ఉపయోగపడుతుందని, తొలి దశలో ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్ల వేపనూనె కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కాండంతో పురుగు కత్తెర పురుగు, ఇతర రసం పీల్చు పురుగులు నివారించబడతాయని కాబట్టి రైతులు ఏదైనా పురుగుమందుతో కలిపి పిచికారి చేసుకోవాలని కోరారు.
