
సాలూరు మండలం తోణం పంచాయతి ముంగివానివలస గ్రామం లో ఆసియన్ పెయింట్స్ బేసిక్ పెయింటింగ్ 6 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం లో భాగంగా శిక్షకులు రోషశ్నకుమార్ ఆధ్వర్యంలో 40 మంది గిరిజన మహిళలకు ఉచితం గా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన మహిళల లో పెయింటింగ్ లో సాధికారిక పెంపొందించి పెయింటింగ్ లో మెలుకువలు తెలుసుకొని ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అలాగే స్వయంఉపాధి ద్వారా వారి యొక్క ఉనికి ని అందమైన పెయింటింగ్స్ ద్వారా సమాజంలో గుర్తింపు పొందడం. ఈ కార్య కార్యక్రమం లీఫార్మసీ డైరెక్టర్ లీలారాణి వారి సిబ్బంది, ఐసీడీసీ పిఓ, డీ.ఎం డబుల్యూ. ఎస్ సెక్రటరీ శాంతి, సిబ్బంది పాల్గొన్నారు.
