
పువ్వుల నాగేశ్వరరావు పెద్దకర్మ రోజున అతిరథ మహారథులు హాజరై ఘన నివాళులు అర్పించారు. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పవన్ ఈశ్వరమ్మ భర్త సీనియర్ రాజకీయ నేత నాగేశ్వరరావు (67) కు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆయన గొప్పతనాన్ని , మంచితనాన్ని, గొప్ప నాయకత్వ లక్షణాలను పలువురు గుర్తుచేసుకున్నారు.సాలూరు వైద్యులు లెజెండ్ డాక్టర్ వి.గణేశ్వరరావు,యువ వైద్యులు, బిజెపి నేత హేమానాయక్ దివంగత పి.నాగేశ్వరరావు కు ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమం లో మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర పాల్గొన్నారు.